August 23, 2022
`విక్రమ్` సినిమాతో ఫుల్‌ఫామ్ లోకి వచ్చారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. దాంతో కమల్ హాసన్ హీరోగా ఆగిపోయిన అన్ని సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. కమల్ హాసన్ (kamal haasan), శంకర్ (Shankar ) కాంబినేషన్ అంటే బాక్సాపీస్ వద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరు మరోసారి ఇండియన్ 2 (Indian 2) సినిమాతో ట్రెండ్ సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
తాజాగా ఇండియన్ 2 షూటింగ్ ఆగస్ట్ 22 నుండి షురూ అయింది. రామ్ చరణ్ సినిమాకు కొంత బ్రేక్ ఇచ్చిన శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ చేస్తున్న కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal) ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్ ద్వారా ఈ సినిమాకు సంబందించిన అప్‌డేట్ ఇచ్చింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో కాజల్ (ప్రెగ్నెన్సీ, బాబు పుట్టిన తర్వాత) మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతుంది. అలాగే ఈ సినిమాను జూన్ 2023లో రిలీజ్‌చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్-కమల్ కాంబోలో వచ్చిన భారతీయుడు బాక్సాపీస్ ను షేక్ చేయడమే కాదు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సీక్వెల్‌గా వస్తున్న ఇండియన్ 2పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి.