సినిమాలకు జీవిత దూరం అవ్వటానికి రాజశేఖర్ కారణమా?

March 5, 2024

సినిమాలకు జీవిత దూరం అవ్వటానికి రాజశేఖర్ కారణమా?

సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో జీవిత ఒకరు. ఈమె సీనియర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈమె సినీ నటుడు రాజశేఖర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఈమెతో పాటు హీరోయిన్స్ గా నటించిన వారందరూ కూడా తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు కానీ జీవిత మాత్రం సినిమాలకు ముఖ్యంగా హీరోయిన్గా దూరమయ్యారు.

ఈ విధంగా ఈమె హీరోయిన్గా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ డైరెక్టర్ గాను, నిర్మాతగాను ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే హీరోయిన్ గా పెళ్లి తర్వాత నటించకపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను జీవిత తాజాగా ఒక కార్యక్రమంలో చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను రాజశేఖర్ గారిని ప్రేమించిన తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము. ఈ మా ప్రేమ విషయం ఇంటిలో చెప్పామని జీవిత తెలిపారు.

ఈ క్రమంలోనే రాజశేఖర్ ని ప్రేమించానని తనని పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని మా ఇంట్లో చెప్పడంతో మా ఇంట్లో వాళ్ళు తొందరగా ఒప్పుకున్నారు. కానీ ఆయన ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదని తెలిపారు. ఎందుకంటే మా కంటే వాళ్ళ కుటుంబం ఆస్తిపరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నవారు కావడంతో పెళ్లికి అంత తొందరగా ఒప్పుకోలేదు. ఇక రాజశేఖర్ మా పెళ్ళికి ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నామని తెలిపారు.

ఇక పెళ్లి తర్వాత తాను హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగడం కంటే ఇంటి కోడలుగా ఇంటి బాధ్యతలను తీసుకొని కుటుంబ సభ్యులతో ఒక మంచి కోడలు అనిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇదే విషయాన్ని నేను రాజశేఖరికి చెప్పడంతో ఆయన కూడా సరే అన్నారు అలా కాకుండా సినిమాలలో నటించు అని చెప్పి ఉంటే నేను నటించేదాన్నేమో కానీ ఆయన మీ ఇష్టం అనడంతో నేను ఇంటికి పరిమితమయ్యానని జీవిత తెలిపారు. అలా ఇంటి బాధ్యతలను కుటుంబ బాధ్యతలను చూసుకోవడంపై దృష్టి పెట్టడంతో నాకు సినిమాలు చేయాలి అని ఆలోచన కూడా రాలేదని ఈమె వెల్లడించారు.

Read More: రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో శర్వానంద్ కొత్త సినిమా.. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం!

ట్రెండింగ్ వార్తలు