బాహుబలి బాటలోనే కల్కి… రెండు భాగాలుగా రానుందా?

June 15, 2024

బాహుబలి బాటలోనే కల్కి… రెండు భాగాలుగా రానుందా?

Kalki 2898 AD Movie Sequel: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రభాస్ అయితే ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ సినిమా ప్రభాస్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమా తరువాత ప్రభాస్ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఈయన చివరిగా సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూలై 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో సుమారు 600 కోట్ల బడ్జెట్తో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలుస్తుంది.

ఈ క్రమంలోనే కల్కి సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే ప్రశ్న ఈయనకు ఎదురయింది. ఇక ఈ ప్రశ్నకు నాగ్ అశ్విన్ సమాధానం చెబుతూ..స్వీకెల్ పై అశ్విన్ ఏటూ తేల్చ‌లేదు. సినిమా రెండు భాగాలుగా ఉంటుందా..? ఉండ‌దా..? అని చెప్ప‌డానికి అత‌డు ఇష్ట‌ప‌డ‌డం లేదు. మరి నిజంగానే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుందా లేదా అనేది తెలియాలి అంటే జూన్ 27 వరకు వేచి చూడాలి.

Read More: జైలు నుంచి బయటకు వచ్చిన హేమ… అలాంటి అవసరం లేదంటూ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు