కల్కి 2 లో కృష్ణుడిగా మహేష్ బాబు.. ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

July 7, 2024

కల్కి 2 లో కృష్ణుడిగా మహేష్ బాబు.. ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతుంది.

ఈ సినిమాలో కృష్ణుడి పాత్ర పై ఎంతో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. కృష్ణుడి ఫేస్ కనపడకుండా ఆయన పాత్రను పెట్టడంతో కృష్ణుడి పాత్రలో ఎవరు నటించారనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది అంతేకాకుండా రాబోయే భాగంలో కూడా కృష్ణుడి పాత్ర కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విజయం తర్వాత డైరెక్టర్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కృష్ణుడి పాత్ర మహేష్ బాబుకి బాగా సూట్ అవుతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి కదా మరి కల్కి 2 లో కృష్ణడిగా మహేష్ బాబుని తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు డైరెక్టర్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

కృష్ణుడి పాత్రకు మహేష్ బాబు బాగా సెట్ అవుతారు నిజమేనండి కానీ ఈ సినిమాలో కాకుండా వేరే సినిమాలు అయితే ఇంకా చాలా బాగుంటుంది. అంటూ ఈయన సమాధానం చెప్పారు. దీంతో కల్కి సినిమాలో మహేష్ బాబు ఉండరని స్పష్టంగా తెలుస్తుంది. అంతే కాకుండా కల్కి సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు గెస్ట్ రోల్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే పార్ట్ 2 లో కూడా క్యామియో రోల్స్ లో భాగంగా మరి కొంతమంది హీరోలను తెచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయని సమాధానం చెప్పారు. ఈ పాత్రలలో నాచురల్ స్టార్ నాని నవీన్ పోలిశెట్టి కూడా భాగమవుతున్నారని తెలుస్తోంది

Related News

ట్రెండింగ్ వార్తలు