Niharika Konidela: ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న మెగా డాటర్!

July 10, 2024

Niharika Konidela: ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న మెగా డాటర్!

మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె ఇండస్ట్రీలో నటిగా నిర్మాతగా కొనసాగుతూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు. అయితే నిహారిక కెరియర్ మొదట్లో యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అనంతరం హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.

ఈ విధంగా నిహారిక సక్సెస్ అందుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెకు ఎంతో ఘనంగా వివాహం చేశారు. అయితే నిహారిక వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలబడలేదని చెప్పాలి. ఈమె తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చేసి తిరిగి తండ్రి వద్దకే వచ్చేసారు. ఈ విధంగా నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈమె పూర్తిగా కెరియర్ పై దృష్టిపెట్టారు.

ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలలో కూడా నటిస్తూ నిర్మిస్తూ నిర్మాతగా కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిహారిక ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.. ఈ క్రమంలోనే తాజాగా ఈమె వైట్ కలర్ షర్టులో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.

అయితే ఈ ఫోటోలలో నిహారిక  లుక్ కాస్త భిన్నంగా ఉండడంతో ఈమె సర్జరీ చేయించుకుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. నిహారిక ఇది వరకు తన పెదాలు చాలా బొద్దుగా ఉండేవి కానీ ఇప్పుడు పెదాలు మారిపోవడంతో ఈమె పెదవులకు సర్జరీ చేయించుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంతో సహాజ సిద్ధంగా ఉండే అందాన్ని ఇలా సర్జరీ ద్వారా పాడు చేసుకున్నావు అంటూ ఈమె ఫోటోలపై నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

ట్రెండింగ్ వార్తలు