ఇబ్బందులలో నటుడు రాజ్  తరుణ్ సినీ కెరియర్.. అవకాశాలు కష్టమేనా?

July 7, 2024

ఇబ్బందులలో నటుడు రాజ్  తరుణ్ సినీ కెరియర్.. అవకాశాలు కష్టమేనా?

Raj Tarun-Lavanya Controversy: సినీ నటుడు రాజ్ తరుణ్ ప్రస్తుతం వివాదంలో చుట్టుకున్నారు. ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన పలు సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి రాజ్ తరుణ్ తిరిగి సినిమా అవకాశాలను అందుకుంటు ఉన్నారు, త్వరలోనే తిరగబడరా స్వామి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచాయి ఇకపోతే ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో లావణ్య అనే ఒక యువతి రాజ్ తరుణ్ గురించి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి రాజ్ తరుణ్ తనతో సహజీవనం చేశారని దాదాపు 11 సంవత్సరాల పాటు మేము రిలేషన్ లో ఉన్నామని అయితే ఇప్పుడు తనని మోసం చేశారని ఆరోపణలు చేశారు.

ఇకపోతే మేము ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామని అయితే త్వరలోనే ఈ విషయాన్ని తెలియజేస్తూ మరోసారి గ్రాండ్గా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నామని కానీ నన్ను మోసం చేశారు అంటూ లావణ్య అనే యువతి ఆరోపణలు చేస్తూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హీరో పై కేస్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది.

ఇక లావణ్యతో రాజ్ తరుణ్ చాలా చనువుగా ఉన్నటువంటి ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వివాదంపై నటుడు రాజ్ తరుణ్ స్పందించారు. తనతో నేను రిలేషన్ లో ఉన్న మాట నిజమేనని అయితే మా రిలేషన్ ఎలాంటి శారీరక రిలేషన్ కాదని తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఆమె మస్తాన్ సాయి అని మరొక వ్యక్తితో రిలేషన్ లో ఉందని ఈయన తెలియజేశారు.

ఇకపోతే తనతో రిలేషన్ లో ఉన్నన్ని రోజులు నన్ను చాలా టార్చర్ పెట్టిందని కానీ ఈ విషయాలను తాను ఎక్కడ బయట చెప్పుకోలేదని రాజ్ తరుణ్ తెలియజేశారు అయితే తనని మోసం చేశారు అంటూ లావణ్య ఈయనపై కేసు పెట్టడంతో పెద్ద ఎత్తున వివాదంలో నిలిచారు అంతేకాకుండా ఈ కేసు కారణంగా భవిష్యత్తులో ఈయనకు సినిమా అవకాశాలు కూడా రావడం కష్టమేనని తెలుస్తోంది

ట్రెండింగ్ వార్తలు