స‌క్సెస్ కోసం పేరు మార్చుకుంటున్న రౌడీ హీరో!

June 14, 2024

స‌క్సెస్ కోసం పేరు మార్చుకుంటున్న రౌడీ హీరో!

సినీ నటుడు విజయ్ దేవరకొండ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇటీవల కాలంలో నటించిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. డియర్ కామ్రేడ్ సినిమా నుంచి మొదలుకొని ఎన్నో అంచనాలతో వ‌చ్చిన లైగ‌ర్‌ వ‌ర‌కు వివిధ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..

ఇలా గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అందుకోకపోవడంతో ఈయన అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చివరిగా ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా ద్వారా కూడా ఈయనకు నిరాశ ఎదురయింది.

ఇక త్వరలోనే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించబోయే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. అయితే ఈ సినిమా అయినా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇలా సినిమాలు సక్సెస్ కాకపోవటంతో ఈయన తల్లి తన పేరులో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారట. ఇలా పేరు మార్చడం వల్ల తనకు సినిమాల పరంగా సక్సెస్ వస్తుందని ఆమె భావించినట్టు సమాచారం.

ఇప్పటికే విజయ్ దేవరకొండ రౌడీ హీరోగా అందరిలోనూ ఎంతో మంచి సొంతం చేసుకున్నారు. ఇలాంటి హీరో తన పేరును మార్చుకోబోతున్నారని తెలిసి అభిమానులు ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అయితే ఇలాంటి విషయాలను ఎంతగానో నమ్మే విజయ్ తల్లి మాత్రం తన పేరు మార్చుకుంటే సక్సెస్ అవుతారని తనపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని తెలుస్తోంది. మరి నిజంగానే విజయ్ దేవరకొండ కోసం తన పేరు మార్చుకుంటారా లేదంటే అదే పేరుతో సక్సెస్ కోసం కష్టపడతారా అనేది తెలియాల్సి ఉంది..

Read MoreMaharaja Telugu Review: విజ‌య్ సేతుప‌తి మ‌హారాజ ఎలా ఉందంటే?

ట్రెండింగ్ వార్తలు