June 29, 2024
స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల ఈయన వరుస చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఇక తాజాగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఇలా వరుస పాన్ ఇండియా సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నా ప్రభాస్ ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే రకం అనే సంగతి మనకు తెలిసిందే.
ఈయన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నప్పటికీ ఎలాంటి వివాదాలకు వెళ్లరు. ఎవరి గురించి పొరపాటున గర్వంగా పొగరుగా కూడా మాట్లాడరు. ఇక ప్రభాస్ ఏదైనా సినిమా ఈవెంట్లకు వచ్చినా కూడా ఐదు నిమిషాలకు మించి పెద్దగా మాట్లాడారు. ఇలా సైలెంట్ గా ఉంటూనే తన చుట్టూ ఉన్నవారితో ఎంతో ప్రేమగా మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. ఇక కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తన పెదనాన్న నుంచి క్రమశిక్షణ నేర్చుకొని పెద్దవారిపట్ల అదేవిధంగా వ్యవహరిస్తూ ఉంటారు.
ఇక బయట ఎక్కువగా ప్రభాస్ మాట్లాడకపోవడానికి కారణం లేకపోలేదని చెప్పాలి. ఈయన తన బాల్యం మొత్తం తన కుటుంబ సభ్యులకు కొంతమంది స్నేహితుల సమక్షంలోనే పెరగటం వల్ల బయట ఎవరితోనైనా మాట్లాడాలి అంటే ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎప్పుడు గర్వంగా మాట్లాడరు. ఎందుకంటే తనకన్నా ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్దవాళ్లు స్టార్ హీరోలు ఉన్నారని చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల ముందు తాను ఎప్పటికీ చిన్నవాడిని అంటూ ఈయన ఎంతో వినయంగా సమాధానాలు చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.