July 22, 2024
పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన అప్డేట్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. నిజానికి ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీకి వాయిదా పడింది అయితే షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదలకు సిద్ధమయ్యారు.
ఇక ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ఎన్టీఆర్ కొరటాల శివ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో ఒక హీరో సినిమా చేశారు అంటే తదుపరి ఆ హీరో ఎంత పెద్ద ప్రాజెక్టులో నటించిన ఫ్లాప్ ఎదుర్కోవాల్సిందే ఈ సెంటిమెంట్ ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు భరిస్తూనే వచ్చారు. ఇటీవల RRR సినిమాలో నటించిన రామ్ చరణ్ ఆచార్య సినిమాలో నటించారు. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది దీంతో రాజమౌళి సెంటిమెంట్ ఇక్కడ వర్క్ అవుట్ అయింది.
అప్పటివరకు ఎలాంటి ఫ్లాప్ లేకుండా ఉన్నటువంటి డైరెక్టర్ కొరటాలకు కూడా ఫ్లాప్ డైరెక్టర్ అనే పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఘోర డిజాస్టర్ తర్వాత కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో దేవర రాబోతుంది. ఈ క్రమంలోనే రాజమౌళి బాడ్ సెంటిమెంట్ ఎన్టీఆర్ దేవర పై పడితే ఇది కొరటాల శివకు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమాని ఎలాగైనా సక్సెస్ చేయాలని కొరటాల కసితో పనిచేస్తున్నారు.
ఈ ఒక్క బ్యాడ్ సెంటిమెంట్ కనుక తప్పితే మాత్రం ఎన్టీఆర్ రికార్డుల మోత మోగిస్తారు. అంతేకాకుండా రాజమౌళి సినిమా తర్వాత మొదటి హిట్ అందుకున్న హీరోగా ఎన్టీఆర్ దర్శకుడిగా కొరటాల పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుంటారు