Jacqueline Fernandez: ఆ ఫోటోల‌ను ప్ర‌సారం చేయొద్దు మీడియాకు జాక్వెలిన్ రిక్వెస్ట్‌

January 10, 2022

Jacqueline Fernandez: ఆ ఫోటోల‌ను ప్ర‌సారం చేయొద్దు మీడియాకు జాక్వెలిన్ రిక్వెస్ట్‌

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గ‌త‌ కొంతకాలంగా ఏదో ఒక‌ర‌కంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. కాన్ మ్యాన్ సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలు బాలీవుడ్ హీరోయిన్లతో పాటు జాక్వెలిన్ కి సుఖేష్ ఖరీదైన బహుమతులు ఇవ్వడంతో ఈడీ ఆమెని విచారించింది. అప్పటి నుంచి మీడియాలో జాక్వెలిన్ పేరు మారుమ్రోగుతూనే ఉంది. ఇటీవ‌ల ఇండియా వ‌దిలి వెళ్లడానికి ప్రయత్నించగా.. ఎయిర్‌పోర్ట్‌లోనే ఆమెను అధికారులు అడ్డుకున్నారు.

సుఖేష్ తో జాక్వెలిన్ క్లోజ్ గా ఉన్న సెల్ఫీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు రాగా.. జాక్వెలిన్ వాటిని కొట్టిపారేసింది. తాజాగా జాక్వెలిన్ కి సంబంధించిన మరో ప్రైవేట్ ఫొటో బయటకొచ్చింది. ఇందులో సుఖేష్ ఆమెని ముద్దాడుతూ కనిపించాడు. ఇద్దరూ ఒకే బెడ్ పై ఉన్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో షేర్ చేస్తూ చాలా మంది జాక్వెలిన్ ని ట్రోల్ చేస్తున్నారు.

సుఖేష్ తో లీక్ అయిన ఫొటోను ప్రసారం చేయొద్దని మీడియాను రిక్వెస్ట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఈ దేశం, ఈ ప్రజలు నాకు విపరీతమైన ప్రేమ, గౌరవాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం నేను కఠినమైన పరిస్థితిలో ఉన్నాను. అది నా స్నేహితులు, అభిమానులు గమనిస్తూనే ఉన్నారని తెలుసు. ఈ నమ్మకంతోనే నా వ్యక్తిగత చిత్రాలను ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులను అభ్యర్థిస్తున్నాను. నేను ఇప్పటికే చాలా నేర్చుకున్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తున్నాను. మీరు మీ ప్రియమైన వారికి ఇలా చేయరు కదా. అలాగే నాకు కూడా ఇలా చేయరని నమ్ముతున్నా. న్యాయం, మంచి గెలుస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.’ అంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.

https://www.instagram.com/p/CYeHVRPNN_O/?utm_source=ig_web_copy_link

ట్రెండింగ్ వార్తలు