నాగార్జున అన్ని కోట్లు సంపాదించడానికి కారణం అదే.. జగపతిబాబు కామెంట్స్ వైరల్!

June 4, 2024

నాగార్జున అన్ని కోట్లు సంపాదించడానికి కారణం అదే.. జగపతిబాబు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు నాగార్జున. నాగార్జునకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా టాలీవుడ్ రిచెస్ట్ హీరోల్లో నాగార్జున పేరు ముందుగా చెప్పుకోవచ్చు. నాగార్జున హీరోగా రాణిస్తూనే అనేక వ్యాపారాల్లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ లకు తీసిపోని విధంగా సంపాదిస్తున్నారు. నాగార్జునకి వేలకోట్ల ఆస్తులు ఉన్నాయనేది ఇండస్ట్రీలో టాక్.

అయితే అందులో మొత్తం సంపాదించగా మరికొన్ని తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నుంచి వచ్చాయని టాక్. అయితే అది కొంతవరకు వాస్తవం కావచ్చు కానీ పూర్తిగా కాదు. నాగార్జున సొంతగా ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు. సినిమాలలో నటించడంతోపాటు, కమర్షియల్ యాడ్స్ చేస్తూ, అనేక రకాల బిజినెస్ లు చేస్తూ మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే నాగార్జున ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడం వెనుక ఉన్న రీజన్ ని తాజాగా తన స్నేహితుడు జగపతిబాబు బయట పెట్టారు. నాగార్జున, జగపతి బాబు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. జగపతి బాబు నాగార్జున ఆ పేరుతో కాకుండా మరో షార్ట్ నేమ్ తో పిలుస్తారట.

నాగార్జునని అలా పిలిచేది కేవలం తానొక్కడినే అని జగపతి బాబు అన్నారు. అసలు ఇంతకీ నాగ్ ని జగపతి బాబు పిలిచేది చౌ అని పిలుస్తారట. చౌ అంటే కులం పరంగా అలా పిలుస్తారా అన్న ప్రశ్నకు జగపతిబాబు సమాధానం ఇస్తూ.. కులానికి దానికి సంబంధం లేదు. నన్ను కూడా నాగార్జున తిరిగి చౌ అనే అంటాడు. మా పేరులో చౌదరి ఉంది. కాబట్టి షార్ట్ గా అలా పిలుచుకుంటాం అని జగ్గూభాయ్ తెలిపారు. నాగార్జునని రెండురోజులకి ఒకసారి అయినా తలచుకుంటా అని జగపతి బాబు తెలిపారు. నాగార్జునకి ఎలా డబ్బు సంపాదించాలో బాగా తెలుసు. దానిని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలుసు. నాగార్జున ఏదైనా పని కానీ, వ్యాపారం కానీ మొదలు పెడితే అందులో స్వయంగా ఇన్వాల్వ్ అవుతాడు. వేరే వాళ్ళకి అప్పగించి సైలెంట్ గా ఉండదు. బాగా తెలివైన వాడు. నాగార్జున ఏ విషయాన్ని అయినా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఉంటాడు. అదే నాగార్జున సక్సెస్ సీక్రెట్ అని చెప్పుకొచ్చారు జగపతిబాబు.

Read More: ప్రేమలు హీరోయిన్‏కు చుక్కలు చూపించిన ఫ్యాన్స్.. వీడియో వైరల్!

ట్రెండింగ్ వార్తలు