హీరోయిన్ల గిఫ్టుల కోసం ఆస్తులను కరిగించిన జగపతిబాబు… ఇలా కూడా చేస్తారా?

June 10, 2024

హీరోయిన్ల గిఫ్టుల కోసం ఆస్తులను కరిగించిన జగపతిబాబు… ఇలా కూడా చేస్తారా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు జగపతిబాబు ఒకరు ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇలా హీరోగా కొనసాగుతున్న ఈయన భారీ స్థాయిలో ఆస్తులను కూడా పెట్టారు కానీ ఉన్నఫలంగా తన ఆస్తులన్నీ కూడా కరిగిపోయాయి.

ఇలా జగపతిబాబు ఆస్తులను పోగొట్టుకోవడం కాకుండా మరో వైపు సినిమా అవకాశాలు కూడా లేకపోవడంతో ఒకానొక సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. ఈ విధంగా జగపతిబాబు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయనకు విలన్ గా నటించే అవకాశాలు రావడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇక జగపతిబాబు ఆస్తులను కోల్పోవడానికి కారణం ఆయన జూదం ఆడతారు అనే విషయం వెలుగులోకి వచ్చింది అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన ఆస్తులను పోగొట్టుకోవడానికి గల కారణాలను తెలిపారు. నేను కేవలం జూదం ఆడి మాత్రమే డబ్బు పోగొట్టుకోలేదని తెలిపారు. జూదం ఆడు సుమారు రెండు కోట్ల వరకు పోయిన ఇతర కారణాల వల్ల కూడా మరింత ఆస్తులను పోగొట్టుకున్నానని తెలిపారు.

మీరు హీరోయిన్లకు గిఫ్టులిస్తూ కూడా ఆస్తులను ఖర్చు చేశారట ఇందులో నిజం ఎంత అని యాంకర్ ప్రశ్నించారు.నేను హీరోయిన్లతో బయటకు వెళ్ళినప్పుడు ఖర్చు మొత్తం నేనే భరిస్తాం అయితే వారిని ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశం కాదని తెలిపారు. ఎవరితోనైనా నేను బయటకు వెళ్తే ఖర్చు మొత్తం తానే భరిస్తాను ఏదైనా పార్టీకి వెళ్తే పార్టీ బిల్ మొత్తం నేనే పే చేస్తాను. నాకెంతో ఇష్టమైన హీరోయిన్లతో షాపింగ్ కి వెళ్తే షాపింగ్ బిల్ మొత్తం నేనే కట్టేవాడిని. ఇలా అన్ని విధాలుగా డబ్బును కోల్పోయానని ఇక మరొక విషయం ఏమిటంటే అప్పుచేసి ఇల్లు కట్టానని వడ్డీ కోసమే 20 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది అంటూ తన ఆస్తి కోల్పోవడం గురించి జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: బాలయ్య బర్త్ డే స్పెషల్.. అఖండ సీక్వెల్ ప్రకటించిన బోయపాటి?

ట్రెండింగ్ వార్తలు