సౌందర్య చనిపోతే ఏడవాలని రూల్ లేదు… జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు!

June 3, 2024

సౌందర్య చనిపోతే ఏడవాలని రూల్ లేదు… జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దివంగత నటి సౌందర్య ఒకరు. మహానటి సావిత్రి తర్వాత అంత అద్భుతమైన పాత్రలలో నటించే హీరోయిన్ గా సౌందర్య పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఈమె వివిధ భాష చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే అనుకోని ప్రమాదంలో ఈమె మరణించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన సూపర్ హిట్ చిత్రాలను అందుకున్న సౌందర్య 2004వ సంవత్సరంలో రాజకీయ ప్రచార కార్యక్రమాలలో భాగంగా తన సోదరుడు అమర్నాథ్ తో కలిసి వెళుతున్నటువంటి హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంతో ఈమె ఈ ప్రమాదంలో మరణించారు. సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా మరణించడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఇలా సౌందర్య మరణం తర్వాత ఎంతోమంది ఆమె మరణం గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు. ఇక సౌందర్యకు ఇండస్ట్రీలో బాగా క్లోజ్ అయినటువంటి వారిలో జగపతిబాబు ఆమని వంటి వారి పేర్లు ఉన్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జగపతి బాబుకు సౌందర్య మరణం గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. సౌందర్య లాంటి క్లోజ్ ఫ్రెండ్ మరణించిన తర్వాత మీ మానసిక పరిస్థితి ఎలా ఉండేదని యాంకర్ ఈయనని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు జగపతిబాబు సమాధానం చెబుతూ..నేను ఎక్కువగా ఫిలాసఫీ నమ్ముతాను. నా మైండ్ లో అది ఎక్కువగా ఉంటుంది. పుడతాం పోతాం అని అందరికి తెలుసు. జీవితంలో డబ్బు కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే తిరిగి సంపాదించుకోలేము ఆ విషయం అందరికీ తెలుసు ఆ విషయంలో బాధ ఉన్న ఏడవాలని రూల్ ఎక్కడా లేదని తెలిపారు. ఇక సౌందర్య మరణించిన తర్వాత తాను మరణించిందని బాధపడ్డానే తప్ప ఏడవలేదని పైగా తాను చనిపోయిందనే విషయం కంటే తన కుటుంబ పరిస్థితి ఏంటి అనేది నన్ను చాలా బాధపెట్టిందని జగపతిబాబు తెలిపారు. తన సోదరుడు చనిపోయారు వాళ్ళ భార్య తల్లి పిల్లల పరిస్థితి ఏంటి అనే విషయం గురించి నేను చాలా బాధపడ్డానని జగపతిబాబు ఈ సందర్భంగా తెలిపారు.

Read More: మామయ్య పక్కన మద్యం.. వాటర్ బాటిల్స్ ఉండాల్సిందే.. బాలయ్య అల్లుడి కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు