February 13, 2024
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు జగపతిబాబు ఒకరు. ఈయన హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈయన తండ్రి ఇండస్ట్రీలో పెద్ద నిర్మాత అనే విషయం మనకు తెలుసు. తన కుమారుడిని మాస్ హీరో చేయాలని ఎంతో తాపత్రయ పడగ ఈయన మాత్రం ఫ్యామిలీ హీరోగా మారిపోయారు.
ఇలా ఫ్యామిలీ హీరోగా ఎన్నో అద్భుతమైన కుటుంబ కథ చిత్రాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నటువంటి జగపతిబాబు మెల్లమెల్లగా అవకాశాలను కోల్పోతూ వచ్చారు ఇలా అవకాశాలు కోల్పోయినటువంటి ఈయన తండ్రి సంపాదించిన ఆస్తులను మొత్తం కరిగించేశారు. ఇలా నిలవ నీడ లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈయన తన వద్ద ఉన్నటువంటి రెండు ఫోన్లను చూస్తూ ఎవరైనా అవకాశం కల్పిస్తారా అని ఎదురు చూసే వాడినని తెలిపారు.
ఇక తనకు తన సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోగా కాకుండా విలన్ పాత్రలలో అవకాశం వస్తే తాను నటించానని తెలిపారు. అయితే హీరోగా కంటే విలన్ గానే నేను ఎక్కువగా సంపాదించానని ఇప్పుడే తన లైఫ్ చాలా బాగుందని జగపతిబాబు తెలిపారు. ఈయన ఒకరోజు షూటింగ్లో పాల్గొంటే పది లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండే జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఏ విషయమైనా ముక్కుసూటిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నటువంటి జగపతిబాబు ఒక చేతిలో మందు బాటిల్ మరో చేతిలో కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకొని ఉన్నటువంటి ఫోటో షేర్ చేశారు.
ఎలాగో పుట్టేసాను ఈ పుట్టినరోజు ఏది తాగమంటారు ఆలస్యం చేయకుండా వెంటనే సమాధానం చెప్పండి అంటూ అభిమానులను ఉద్దేశించి ఈయన చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ పై పలువురు నెటిజన్స్ ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అన్న అంటూ కామెంట్ చేయడం మరికొందరు రెండు కలుపుకొని తాగేసేయండి అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా జగపతిబాబు మందు తాగమంటారా అంటూ అభిమానులను అడగటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Read More: ఇప్పటివరకు అవార్డు ఇవ్వలేదు.. ఏపీ ప్రభుత్వం పై సెటైర్స్ వేసిన రోహిణి?