ఒకవైపు డాన్సులు, మరోవైపు యాడ్స్ తో బిజీగా ఉన్న జక్కన్న.. మరి మహేష్ సినిమా సంగతేంటి అంటున్న అభిమానులు?

April 13, 2024

ఒకవైపు డాన్సులు, మరోవైపు యాడ్స్ తో బిజీగా ఉన్న జక్కన్న.. మరి మహేష్ సినిమా సంగతేంటి అంటున్న అభిమానులు?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాలకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా రాజమౌళి చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ ను సాధించింది. అంతేకాకుండా ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో జక్కన్న క్రేజ్ మరింత పెరిగింది. ఇకపోతే రాజమౌళి తన తదుపరి సినిమాను ప్రిన్స్ మహేష్ బాబు తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.

ఈ మూవీపై భారీగా అంచనాలు నెల కొన్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఎలాంటి అప్డేట్ లేదు. రాజమౌళి,మహేష్ సినిమా స్క్రిప్టు వర్క్ పూర్తయిందని, మ్యూజిక్ వర్క్ మొదలైందని పలువురు మాట్లాడినా రాజమౌళి మాత్రం ఈ సినిమా గురించి అసలు మాట్లాడటం లేదు. ఇది ఇలా ఉంటే ఇటీవల రాజమౌళి వరుసగా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న తన భార్యతో కలిసి స్టేజి మీద డాన్స్ వేసిన రాజమౌళి ఆ తర్వాత, డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ వార్తల్లో నిలిచారు. తాజాగా డేవిడ్ వార్నర్ తో యాడ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇవన్నీ చేస్తూ జక్కన్న ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ మహేష్ సినిమా వర్క్ చేస్తున్నా అది బయటకి కనపడకపోవడంతో మహేష్ అభిమానులు రాజమౌళిని ఆడేసుకుంటున్నారు. తాజాగా రాజమౌళి డేవిడ్ వార్నర్ యాడ్ వైరల్ అవ్వడంతో మహేష్ అభిమానులు.. అసలు మహేష్ బాబుతో సినిమా ఉందా? అసలు మహేష్ సినిమా వర్క్ జరుగుతుందా? ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు? సినిమా లేదని ప్రాంక్ చేయరుగా? మా ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకోకండి అంటూ సరదాగా సోషల్ మీడియాలో మీమ్స్ వేస్తున్నారు. ఇంకొందరు ఒక వైపు యాడ్స్, మరోవైపు డాన్స్ లు మరి మా సంగతి ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://telugu.chitraseema.org/global-star-arrived-in-chennai-with-upasana-and-klin-kaara-to-receive-honorory-doctorate/

ట్రెండింగ్ వార్తలు