చరణ్, తారక్ సినిమాలకు ఊహించని కండిషన్ పెట్టిన జాన్వీ… అవి ఉండకూడదంటూ?

June 3, 2024

చరణ్, తారక్ సినిమాలకు ఊహించని కండిషన్ పెట్టిన జాన్వీ… అవి ఉండకూడదంటూ?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అవకాశాలు మాత్రమే కాకుండా తెలుగులో రాబోతున్నటువంటి పాన్ ఇండియా సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈమె అనుకున్న స్థాయిలో ఏ సినిమా ద్వారా కూడా సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి.

ఇప్పటివరకు ఈమెకు సరైన హిట్ మాత్రం పడలేదు. ఇలా సినిమా అవకాశాల కోసం పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేసే ఈమె ప్రస్తుతం మాత్రం వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న దేవర సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నారు. ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నారు.

ఇలా రాంచరణ్ ఎన్టీఆర్ వంటి సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమెకు ఈ సినిమాలు కచ్చితంగా సక్సెస్ అందిస్తాయని భావిస్తుంది. అయితే ఈ సినిమాలలో నటించడం కోసం డైరెక్టర్లకు ఈమె భారీ కండిషన్ పెట్టారని తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే తెలుగులో అవకాశాలు అందుకుంటున్నటువంటి జాన్వీ కపూర్ తెలుగులో ఎక్కువ కాలం పాటు కొనసాగాలని ప్లాన్ చేశారు.

ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి మొదట్లోనే పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ తను కెరియర్ ఉండదని భావించిన ఈమె ఈ ఇద్దరి హీరోల సినిమాలలో గ్లామర్ షో కి తావు లేకుండా ఉండాలని నిర్మాతలను కోరారుట. ఇలా గ్లామర్ షో చేయడానికి వీలు లేకుండా సాంప్రదాయ బద్దంగా ఈ సినిమాలలో కనిపించడం కోసం ఈమె ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. ఈ ఒక్క విషయంలోనే దర్శకులకు జాన్వీ కండిషన్ పెట్టారని సమాచారం.

Read More: బెంగళూరు సీబీఐ కస్టడీలో నటి హేమ!

ట్రెండింగ్ వార్తలు