March 1, 2024
పుష్ప సినిమాలో ఊ అంటావా మావా..సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే పుష్ప 2 సినిమాలో అలాంటి సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఊ అంటావా సాంగ్ ని మించేలాగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రేక్షకులు, మూవీ మేకర్స్ కూడా. అందుకే పుష్ప టు స్పెషల్ సాంగ్ లో యాక్ట్ చేయడానికి పెద్ద పెద్ద తారల వైపు చూస్తున్నారు సుకుమార్. ఈ క్రమంలోనే పుష్పాటూలో ఐటెం సాంగ్ గురించి దర్శకుడు సుకుమార్ జాన్వీ కపూర్ ని సంప్రదించినట్లు సినీ వర్గాల సమాచారం.
అయితే ఈ పాటకి జాన్వీ ఆమోదం ఇస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఆమె కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కిస్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది జాన్వీ. ఇక పుష్ప సినిమాలో ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన కూడా నటించటానికి ఒప్పుకుంటుందేమో చూడాలి.
అయితే ఈ సినిమాకి జాన్వి ఓకే చెప్తే ఆమెకి మరింత మైలేజ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. డిఎస్పి కూడా ఈ స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావ సాంగ్ ని తలదన్నేలా ఉండాలని అద్భుతమైన ట్యూన్ ని రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఐ కాన్ స్టార్ పక్కన నటించాలని ప్రతి హీరోయిన్ తపన పడటం సహజం. ఈ క్రమంలో జాన్వీ కూడా ఈ పాటకి ఊ అంటుందేమో అని ఎదురుచూస్తున్నారు మేకర్స్.
ఈ పాటకి జాన్వీ కాలు కలిపితే సినిమాకి కూడా అదనపు ఆకర్షణ చేకూరుతుంది. మొన్నటి వరకు ఈ పాట కోసం శ్రీలీల ని అప్రోచ్ అయినట్లు తెలిసింది. అయితే ఆమె రెండు కోట్లు డిమాండ్ చేయటంతో మేకర్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. యాక్షన్ డ్రామా తో మన ముందుకి రాబోతున్న పుష్పటు సినిమాకి డిఎస్పి సంగీతం అందించారు ఆగస్టు 15, 2024న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా ఇందులో ఫహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్ మరియు రష్మిక మందన్న కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Read More: గామి ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే!