అమ్మ చనిపోయిన తర్వాత వాటిపై నమ్మకం పెరిగింది.. శుక్రవారం ఆ పని చేయను: జాన్వీ కపూర్

May 27, 2024

అమ్మ చనిపోయిన తర్వాత వాటిపై నమ్మకం పెరిగింది.. శుక్రవారం ఆ పని చేయను: జాన్వీ కపూర్

దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్. ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమాలో అవకాశమందుకున్న జాన్వీ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోయే సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన తల్లి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన అమ్మ బ్రతికి ఉన్నప్పుడు హిందూ మతాచారాలను ఎంతగానో విశ్వసించేవారు. అమ్మ శుక్రవారం జుట్టు కత్తిరించేది కాదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని చెప్పేవారు. అలాగే నల్ల బట్టలు ధరించేవారు కాదు కానీ మేము మాత్రం వాటిని నమ్మేవాళ్ళం కాదు. కానీ అమ్మ మరణించిన తర్వాత తాను కూడా ఆ పద్ధతులను పాటిస్తున్నానని తెలిపారు.

ఇప్పటికి నేను శుక్రవారం నలుపు దుస్తులను ధరించను అలాగే జుట్టు కూడా కత్తిరించనని జాన్వీ కపూర్ తెలిపారు. ఇకపోతే అమ్మ ఎప్పుడు కూడా తిరుమల శ్రీవారిని స్మరించుకుంటూ ఉండేది మనసులోనే నారాయణ అంటూ స్వామివారి స్మరణ చేసేవారు అలాగే అమ్మ ప్రతి ఏడాది పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారని జాన్వీ తెలిపారు.

ఇక అమ్మ మరణించిన తర్వాత అమ్మ పుట్టినరోజు సందర్భంగా తాను తిరుమలకు వెళ్లడం అలవాటు చేసుకున్నానని ఈ సందర్భంగా శ్రీదేవి ఏ విధంగా అయితే హిందూ మతాచారాలను నమ్మేవారో ఆ పద్ధతులను తాను కూడా అనుసరిస్తూ ఉన్నానని జాన్వీ కపూర్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నటువంటి ఈమె ఈ సినిమా ద్వారా అక్టోబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Read More: భారతీయ సినీ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన రవితేజ?

ట్రెండింగ్ వార్తలు