మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన జాన్వీ.. అమ్మ మామూలుగా లేదే?

February 20, 2024

మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన జాన్వీ.. అమ్మ మామూలుగా లేదే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నటువంటి వారిలో దివంగత నటి శ్రీదేవి వారసురాలు నటి జాన్వీ కపూర్ ఒకరు. ఈమె తన తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు అయితే శ్రీదేవికి తెలుగులో ఎంతో మంచి ఆదరణ ఉంది తెలుగు భాష అంటే శ్రీదేవికి ఎంతో అమితమైనటువంటి ప్రేమ గౌరవం ఈ క్రమంలోనే తన తల్లి మాదిరిగానే ఈమె కూడా సౌత్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

సౌత్ సినిమా ఇండస్ట్రీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, సౌత్ ఇండస్ట్రీలో నా మొదటి ప్రాధాన్యత తెలుగు చిత్ర పరిశ్రమకే ఉంటుంది అంటూ పలు సందర్భాలలో జాన్వీ కపూర్ కామెంట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఈమె త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి పాన్ ఇండియా చిత్రం దేవర సినిమాలో హీరోయిన్గా ఈమె ఎంపికైన విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇలా ఈ సినిమా షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు అయితే ఈ సినిమా విడుదల కాకుండానే ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్ట్ సొంతం చేసుకున్నారు. మరో పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పలువురు పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చివరికి జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారని తాజాగా తన తండ్రి బోనీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

త్వరలోనే ఈమె రామ్ చరణ్ సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారని తెలిపారు. తన కుమార్తెకు తెలుగులో ఇది మరో మంచి అవకాశం అంటూ బోణీ కపూర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె ఒక సినిమా విడుదల కాకుండానే మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో నిజంగానే ఈమె లక్కీ బ్యూటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Read More: ఆఫర్ల మీద ఆఫర్లు కొట్టేస్తున్న నిధి అగర్వాల్.. మెగా హీరోతో నటించనున్న ఇస్మార్ట్ భామ!

ట్రెండింగ్ వార్తలు