`జాతిరత్నాలు` సీక్వెల్‌ ప్లానింగ్‌..ఎప్పుడో తెలుసా…!

August 28, 2022

`జాతిరత్నాలు` సీక్వెల్‌ ప్లానింగ్‌..ఎప్పుడో తెలుసా…!

కరోనా సమయంలో విడుదలై 2021లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘జాతిరత్నాలు’. 7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దాదాపు 70 కోట్ల వసూళ్లను రాబట్టి ఔరా అనిపించింది. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కేవీ అనుదీప్‌ దర్శకత్వం వహించారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకు నిర్మాత. రీసెంట్‌గా ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ సినిమాకు కథ అందించారు కేవీ అనుదీప్‌. శ్రీకాంత్‌ రెడ్డి, సంచిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కేవీ అనుదీప్‌ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన పేరు కేవీ అనుదీప్‌ కాదని, డి. అనుదీప్‌ అని వెల్లడించారు. అయితే తన తల్లిదండ్రుల పేర్లు తన పేరులో ఉండాలనుకుని కేవీని చేర్చుకుని కేవీ అనుదీప్‌గా మార్చుకున్నట్లు పేర్కొన్నారు అనుదీప్‌.

అలాగే జాతిరత్నాలు సీక్వెల్‌ గురించి కూడా అనుదీప్‌ మాట్లాడారు. ‘జాతిరత్నాలు’ సీక్వెల్‌ ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు కాదు నాలుగైదు సంవత్సరాల తర్వాత తప్పక చేస్తానన్నారు. అలాగే జాతిరత్నాలు సినిమాను ఇతర భాషల్లో డబ్‌ చేసే ఆలోచనలు ఉన్నట్లు కూడా కేవీ అనుదీప్‌ పేర్కొన్నారు. ఇక కేవీ అనుదీప్‌ దర్శకత్వం వహించిన ప్రిన్స్‌ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ కానుంది. తమిళ హీరో శివకార్తికేయన్‌ ఈ సినిమాలో హీరోగా నటించారు. అలాగే వెంకటేశ్‌ కూడా రీసెంట్‌గా ఓ కథను వినిపించారట కేవీ అనుదీప్‌. త్వరలో అనుదీప్‌ నెక్ట్స్‌ చిత్రంపై ఓ ప్రకటన రానుంది.

ట్రెండింగ్ వార్తలు