March 25, 2024
సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు జేడీ చక్రవర్తి ఒకరు. ఈయన మొదటిసారి నాగార్జున హీరోగా నటించిన శివ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఇది ఆయనకు మొదటి సినిమా కావటం విశేషం ఇలా తన సినీ ప్రయాణం మొదలుపెట్టి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి హీరోగా ఎంతో మంచిది సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జెడి చక్రవర్తి కొంతకాలం పాటు సినిమాలకు దూరమైన తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన దయ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చక్రవర్తి నాగార్జునతో తణుకు జరిగినటువంటి గొడవ గురించి తెలియజేశారు.
శివ సినిమా సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ పటాన్ చెరువులోని ఒక కేఫ్ లో జరుగుతుంది అయితే ఆ కేఫ్ నుంచి నేను బయటకు వస్తున్నటువంటి సమయంలో అనుకోకుండా నాగార్జున గారికి నా భుజం తగిలింది. అక్కడ నా తప్పు ఏమీ లేదు కానీ నాగార్జున గారు నన్ను తిట్టారు. నిజానికి నాకు అది మొదటి సినిమా.. ఆ సినిమాలో నాకు అవకాశం రావడమే గొప్ప.
నాగార్జున గారిని తగిలినప్పుడు నేను ఆయనకు క్షమాపణలు కనుక చెప్పి ఉంటే అంతటితో ఆగిపోయేది కానీ నేను అలా చేయకపోవడంతో ఆయన నాకు వార్నింగ్ ఇచ్చారు అంటూ ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి నాగార్జునతో తనకు జరిగిన గొడవ గురించి ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Read More: కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసిన బర్రెలక్క.. వైరల్ అవుతున్న ఫ్రీ వెడ్డింగ్ షూట్?