గుడ్ క్యూట్ కపుల్ జీవిత, రాజశేఖర్ ల జంట గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో అన్యోన్యంగా జీవించే దంపతుల్లో రాజశేఖర్, జీవిత జంట కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లయి ఇన్నేళ్లు అవుతున్నా కూడా ఎంతో ఆనందంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణం కన్నా మిన్నగా భావించి జీవిస్తున్నారు. ఇకపోతే ఈ దంపతులకు శివాత్మిక,శివాని అనే ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే.ఇప్పటికే వీరు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రానిస్తున్నారు. ఇకపోతే జీవిత రాజశేఖర్ ల ప్రేమ గురించి ఎన్నోసార్లు ఎన్నో రకాల కథనాలు వినిపించిన విషయం తెలిసిందే.
కానీ జీవిత స్వయంగా తాజాగా రాజశేఖర్ తో ప్రేమ గురించి బోల్డ్ గా కొన్ని విషయాలు బయట పెట్టింది. పెళ్ళికి ముందు నుంచే ఆయనతో తానూ ఎమోషనల్ గా అటాచ్ అయి ఉన్నట్లు ఆమె తెలిపింది. రాజశేఖర్ కి నాకు మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవు. నేను కరెక్ట్ గా ఉన్నంత వరకు నా భర్త పిల్లలు నన్ను వదిలిపెట్టి వెళ్లరు. కాంప్రమైజింగ్ గా అర్థం చేసుకునే విధంగా ఉంటే భార్య భర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రాజశేఖర్ గారికి అభిమానులు, బయట పనులు, సినిమాలు ఎన్ని ఉన్నా నాతో చెప్పకుండా ఏమి చేయరు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి ఆయన్ని పిలిస్తే ఆ విషయం కూడా నాతో చెబుతారు.
అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అని జీవిత నవ్వుతూ తెలిపారు. అయితే మేమిద్దరం ప్రేమించుకుంటున్నప్పుడు పెళ్లి గురించి ప్రస్తావన వస్తే పెద్దల అంగీకారంతోనే పెళ్లి అని ఇద్దరం ఫిక్స్ అయ్యాము. నేను బోల్డ్ గా చెప్పేస్తున్నాను. పెళ్ళికి ముందే నేను రాజశేఖర్ గారితో ఒకే రూమ్ లో గడిపాను. ఇద్దరం కలసి జీవించాము. మా ఇద్దరి క్లోజ్ రిలేషన్ వల్ల ఇండస్ట్రీలో మా గురించి పెద్ద హాట్ టాపిక్ అయింది. రాజశేఖర్ గారితో బోల్డ్ గా జీవించినప్పటికీ ఒక వేళ పెళ్లి కాకుంటే నా పరిస్థితి ఏంటి అని నేను భయపడలేదు. ఒకరోజు నేను మా అమ్మకి కూడా చెప్పా. అమ్మ నేను ఇంతే.. ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నా సరే ఆయనతో రిలేషన్ లో ఉంటాను.
ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎలా ఒప్పిస్తారు అనేది ఆయన ఇష్టం. కానీ నేను ఇంతే అని చెప్పేశాను. అప్పుడు ఇండస్ట్రీకి చెందిన ఒక అమ్మాయితో రాజశేఖర్ గారికి పెళ్లి ఫిక్స్ అయింది.
ఒక రోజు ఆ అమ్మాయి నన్ను కలవాలని అడిగిందట. రాజశేఖర్ గారు ఆ అమ్మాయిని తీసుకువచ్చారు. ఇద్దరికీ రాజశేఖర్ అంటే బాగా ఇష్టం ఏర్పడింది. కానీ ఆ అమ్మాయి నా గురించి వాళ్ళ పేరెంట్స్ తో చర్చించిందట. వాళ్ళ పేరెంట్స్ రాజశేఖర్ గారికి కండిషన్ పెట్టారు. ఈ పెళ్లి జరగాలంటే నువ్వు జీవితని వదిలేయాలి అని అన్నారు. ఆమెతో మాట్లాడకూడదు అని చెప్పారట.
కానీ రాజశేఖర్ నా వైపు నుంచి తప్పు ఉండదు. కానీ మాట్లాడకుండా ఉండడం మాత్రం కుదరదు అని చెప్పేశారు. దీనితో వాళ్ళు చర్చించుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్ లో రాజశేఖర్ గారికి నేనే సేవలు చేశాను. హాస్పిటల్ నుంచి మా ఇంటికి కూడా వెళ్ళలేదు. రాజశేఖర్ గారి ఇంటికే వెళ్ళాను. ఆయన పూర్తిగా కోలుకునే వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఆ తర్వాత మేం డిసైడ్ అయి పెళ్లి చేసుకున్నాము అని చెప్పుకొచ్చింది జీవిత రాజశేఖర్.