May 11, 2024
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లను హీరోయిన్ సమంత పేరు కూడా ఒకటి. తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది సమంత. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తుంది. చివరగా గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా తర్వాత ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం వర్క్ అవుట్స్ చేస్తూ సినిమా షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉంది సామ్. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత అభిమానులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. సెలబ్రిటీగా, బిజినెస్ విమెన్ గా సత్తా చాటుతున్న ఆమె తన కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ప్రకటన ఇచ్చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సమంత. పలు సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సమంత.. నటిగా కొనసాగుతూనే వ్యాపారాలు కూడా చేస్తోంది.
కొన్నేళ్ల క్రితం సాకి అనే పేరుతో స్వయంగా దుస్తుల బ్రాండ్‌ను స్థాపించి రన్ చేస్తోంది సామ్. అప్పటి నుంచి ఆమె బ్రాండ్‌కు చెందిన డిజైనర్ దుస్తులు మార్కెట్‌లో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. సాకి బ్రాండ్ అంటే సమంతకు చాలా ఇష్టం కూడా. అయితే ఇప్పుడు ఈ కంపెనీలో సాధారణ పబ్లిక్ కూడా ఉద్యోగాలు చేసే అవకాశం ఉందని సమంత తెలిపింది. ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ తో పాటు మరో రెండు పొజిషన్స్ ఉన్నాయని, తగు అర్హతలు ఉన్నవాళ్లు వివరాలు పంపాలని కోరింది. ఈ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్నవారు ప్రకటనలో పొందు పరిచిన ఈ మెయిల్ అడ్రస్ కి వివరాలు పంపాలని కోరింది సామ్. అయితే సమంత కంపెనీలో జాబ్ అనే సరికి ఈ ప్రకటనకు భారీ రెస్పాన్స్ వస్తోంది. అదేవిధంగా సాకికి బెస్ట్ ప్రమోషన్ దక్కింది. ఇప్పటికే సమంత పెట్టిన పోస్ట్ కు వేలల్లో కామెంట్స్ లైక్స్ కూడా వచ్చాయి. మేము చేస్తాం మేము చేస్తాము అంటూ ఒకరి మీద ఒకరు పోటీపడి మరి కామెంట్స్ చేస్తున్నారు.
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వెళుతున్న తీరు, ఆమె నిజ జీవితంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు నిత్యం జనాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. తనకు నచ్చినట్లుగా పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తోంది సమంత.
మాయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న సమంత.. సోషల్ మీడియాను వేడెక్కించే పని పెట్టుకుంది. హద్దులు చెరిపేసి అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. దీంతో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
సినిమాల్లో సమంత స్టార్ స్టేటస్ పట్టిన తీరు, అక్కినేని ఫ్యామిలీలో ఎంట్రీ.. ఆ తర్వాత తెగదెంపులు, మయోసిటిస్ అనే అరుదైన వ్యాధి, స్నేహితులతో ఎంజాయ్ మూమెంట్స్, రెండో పెళ్లి వార్తలు.. ఇలా సమంత గురించి నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.
గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత.. తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
Read More: నా మనసుకు నచ్చిన వాళ్లకి నేను సపోర్ట్ చేస్తాను.. వైసీపీ ప్రచారంపై బన్నీ కామెంట్!