ఎన్టీఆర్ కి తమ్ముడిగా కన్నడ స్టార్… లక్కీ ఛాన్స్ కొట్టేసిన హీరో?

May 27, 2024

ఎన్టీఆర్ కి తమ్ముడిగా కన్నడ స్టార్… లక్కీ ఛాన్స్ కొట్టేసిన హీరో?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. నటుడిగా ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒకవైపు పాన్ ఇండియా సినిమాలలో నటించడమే కాకుండా మరోవైపు బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్న సంగతి తెలిసిందే.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య భారీ స్థాయిలో యాక్షన్స్ సన్ని వేషాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలు ఎన్టీఆర్ ఒక రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నారట. వార్ సినిమాతో పోలిస్తే ఈ సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందని సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ కి ఓ తమ్ముడి పాత్ర కూడా ఉండబోతుందట. అయితే ఈ పాత్ర నిడివి కాస్త తక్కువగా ఉంటుందని సమాచారం అయితే ఈ పాత్రలో నటించడం కోసం మేకర్స్ కన్నడ హీరో ధ్రువ్ సర్జాను ఎంపిక చేసారని తెలుస్తోంది. ఇక ఈయన ఎన్టీఆర్ కి తమ్ముడు పాత్రలో నటించబోతున్నారు అనే విషయం తెలిసే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఎన్టీఆర్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా కూడా రెండు భాగాలుగా విడుదల కానుంది.

Read More: రేవ్ పార్టీ కేసులో విచారణకు డుమ్మా కొట్టిన హేమ.. వైరల్ ఫీవర్ అంటూ?

ట్రెండింగ్ వార్తలు