ఖరీదైన కారును కొనుగోలు చేసిన ఎన్టీఆర్.. కారు ధర ఎంత అంటే?

April 3, 2024

ఖరీదైన కారును కొనుగోలు చేసిన ఎన్టీఆర్.. కారు ధర ఎంత అంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ఎన్టీఆర్ ఒకరు. ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది అయితే సినిమా షూటింగ్ ఆలస్యం అయిన సందర్భంలోనే ఈ సినిమాని తిరిగి అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. ఇలా సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ తాజాగా ఖైరతాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు రావడంతో ఒకసారిగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి రావడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే ఎన్టీఆర్ కొత్త కారును కొనుగోలు చేశారని ఆ కారుకు సంబంధించినటువంటి రిజిస్టర్ నెంబర్ కోసమే ఈయన ఆర్టిఓ ఆఫీస్ కి వచ్చారని తెలుస్తుంది.

ఎన్టీఆర్ బ్లాక్ టి-షర్ట్ లో కాలింగ్ గ్లాస్సెస్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కాగా కొత్తగా కొన్న కారు కలర్ ‘నౌటిక్ బ్లూ’లా కనిపిస్తుంది.. ఇక కారు మోడల్ విషయానికి వస్తే.. Mercedes-Benz Maybach S-Class S 580. మార్కెట్ లో దీని విలువ దాదాపు రూ.2.72 కోట్లు ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈయన వద్ద ఎంతో ఖరీదైన లగ్జరీ కార్లు ఉండగా తన గ్యారేజ్ లోకి మరో ఖరీదైన కారు వచ్చే చేరింది.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల గోవా షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకొని వచ్చారు ఈ చిత్రీకరణలో భాగంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు హీరో హీరోయిన్ల పై ఒక సాంగ్ కూడా చిత్రీకరించారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో మొదటి భాగాన్ని అక్టోబర్ 10వ తేదీ విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Read More: అవార్డును అమ్మేసిన విజయ్ దేవరకొండ.. అంత కష్టం ఏమి వచ్చిందబ్బా?

ట్రెండింగ్ వార్తలు