పక్క స్టేట్ కి వెళ్ళిన పొరుగు దేశానికి వెళ్లిన ఎన్టీఆర్ బ్యాగ్ లో అది ఉండాల్సిందేనా?

April 13, 2024

పక్క స్టేట్ కి వెళ్ళిన పొరుగు దేశానికి వెళ్లిన ఎన్టీఆర్ బ్యాగ్ లో అది ఉండాల్సిందేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే .ఈయన కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అవుతూ వస్తున్నారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ నటించిన RRR సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో ఈయన చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటిస్తున్నటువంటి వార్ 2 సినిమా పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. మరోవైపు దేవర సినిమా షూటింగ్ పనులలో కూడా ఈయన బిజీగా ఉన్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమా పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు అలాగే ఇతర దేశాలకు వెళుతూ ఉంటారు ఇలా ఎక్కడైనా ఇతర దేశాలకు వెళ్తున్న సమయంలో తన పర్సనల్ వస్తువుల నుండి ఒక బ్యాగ్ లో పెట్టుకొని ఆ బ్యాగ్ తన వెంటే తీసుకొని వెళ్తూ ఉండడం మనం ఎయిర్ పోర్ట్ లో చూస్తూ ఉంటాము అయితే ఈ బ్యాగ్ లో ఎన్టీఆర్ మాత్రం ఏ వస్తువులు మర్చిపోయిన ఒక వస్తువును మాత్రం అసలు మర్చిపోరని ఎక్కడికి వెళ్లినా దానిని మాత్రం వెంట తీసుకెళ్తూ ఉంటారని తెలుస్తోంది.

మరి ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా తన వెంట తీసుకుపోయే వస్తువులలో బుక్స్ ఉంటాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమట ముఖ్యంగా ప్రయాణం చేస్తే సమయంలోను అలాగే రాత్రి పడుకోవడానికి ముందుగా ఈయన పుస్తకాలు చదువుతారని అందుకే ఏదో ఒక పుస్తకం తనతో పాటు ఆ బ్యాగ్ లో పెట్టుకొని తీసుకు వెళ్తూ ఉంటారని తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ కి పుస్తకాలు చదివే అలవాటు ఉందని తెలిసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఎక్కడికి వెళ్లినా పవన్ కళ్యాణ్ పుస్తకాలతో కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు ఆ జాబితాలోకి ఎన్టీఆర్ కూడా చేరారని తెలుస్తుంది.

https://telugu.chitraseema.org/%e0%b0%ae%e0%b1%87%e0%b0%ae%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%b2%e0%b0%bf%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%95%e0%b0%ae%e0%b1%86%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8/

ట్రెండింగ్ వార్తలు