ఆలయ నిర్మాణం కోసం లక్షల్లో విరాళం ఇచ్చిన ఎన్టీఆర్.. ఎక్కడో తెలుసా?

May 15, 2024

ఆలయ నిర్మాణం కోసం లక్షల్లో విరాళం ఇచ్చిన ఎన్టీఆర్.. ఎక్కడో తెలుసా?

సినీ నటుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు ఎన్టీఆర్ ఒకరు. బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు సుమారు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని సమాచారం.

ఇలా ఒక్కో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి ఎన్టీఆర్ పలుచోట్ల భారీగా ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఎంతో లగ్జరీ లైఫ్ కూడా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ దైవ భక్తిని చాటుకున్నారు. ఈయన ఒక ఆలయ నిర్మాణం కోసం ఏకంగా లక్షల్లో డబ్బును విరాళంగా అందజేశారు.

ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి ఎన్టీఆర్ ఏకంగా 12.5 లక్షల రూపాయల విరాళంగా అందజేశారని తెలుస్తోంది. ఇక ఆలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చినటువంటి దాతల పేర్లను శిలాఫలకంపై ముద్రించారు.

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ దంపతుల పేర్లతో పాటు తన ఇద్దరు కొడుకులు అలాగే తల్లి పేరును కూడా రాయించారు అయితే ఈ ఆలయ ప్రహరీ కోసం ఎన్టీఆర్ ఈ మొత్తంలో డబ్బును చెల్లించడంతో అభిమానులు ఈ వార్తను మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో పాటు వార్ 2 సినిమాలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Read More: హాస్పిటల్ పై బెడ్ పై అలాంటి పరిస్థితిలో రాఖీ సావంత్.. నెట్టింట ఫోటోస్ వైరల్?

ట్రెండింగ్ వార్తలు