ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత.. ఎన్టీఆర్ జయంతి తారక్ ఎమోషనల్ పోస్ట్!

May 28, 2024

ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత.. ఎన్టీఆర్ జయంతి తారక్ ఎమోషనల్ పోస్ట్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా సీనియర్ నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలను పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ నేడు తన తాతయ్య తారకరామారావు జయంతి కావడంతో ఈరోజు ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. తన అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి ఉదయమే ఘాట్ వద్దకు చేరుకున్న ఎన్టీఆర్ తన తాతయ్యకు నివాళులు అర్పించారు.

ఇక ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అక్కడికి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఇక ఎన్టీఆర్ రావడంతో అభిమానులు అందరూ కూడా సీఎం అంటూ ధన్యవాదాలు చేశారు. ఇక తన తాతయ్యకు పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించిన అనంతరం ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా కూడా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది.మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది.పెద్ద మనసుతో ఈ ధరిత్రిని ,ఈ గుండెను ,మరొక్కసారి తాకిపో తాత…సదా మీ ప్రేమకు బానిసను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ పై అభిమానులు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నటువంటి ఎన్టీఆర్ మరోవైపు బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.

Read More: అలా పిలిస్తే గౌరవంగా భావిస్తాను.. నేహా శెట్టి కామెంట్స్ వైరల్!

Related News

ట్రెండింగ్ వార్తలు