కూటమి విజయంపై స్పందించిన ఎన్టీఆర్.. మామయ్యకు శుభాకాంక్షలంటూ?

June 5, 2024

కూటమి విజయంపై స్పందించిన ఎన్టీఆర్.. మామయ్యకు శుభాకాంక్షలంటూ?

ఏపీ ఎన్నికల ఫలితాలలో కూటమి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి మనకు తెలిసిందే. 2019వ సంవత్సరంలో కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగింది అయితే ఈసారి మాత్రం 164 స్థానాలతో విజయం సాధించింది.

ఇలా కూటమి గెలవడంతో పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలందరూ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలవడంతో మెగా ఇంట సంబరాలు కూడా మొదలయ్యాయి. ఇలా సెలబ్రిటీలందరూ స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ ఇప్పటివరకు మౌనంగా ఉన్నారు.

అయితే తాజగా ఎన్టీఆర్ సైతం కూటమి విజయం పై స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ స్పందిస్తూ చేసిన పోస్ట్ తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలలో కూడా ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్పందిస్తూ.. ప్రియమైన ఎన్టీఆర్ మామయ్యకి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తారని ఆశిస్తున్నాను.

ఇక అత్యధిక మెజారిటీతో గెలుపొందిన లోకేష్, మూడోసారి ఘనవిజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ అలాగే ఎంపీలుగా గెలిచిన భరత్ పురందేశ్వరి అత్తయ్యకు , ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ కూటమి విజయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన ఈ పోస్టు వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ పై తెలుగుదేశం అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More: సినిమాలు లేకపోయిన.. ఐఎండీబీ జాబితాలో మరో రికార్డు సొంతం చేసుకున్న సమంత?

ట్రెండింగ్ వార్తలు