ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. కెరియర్ లోనే హైయెస్ట్?

June 8, 2024

ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. కెరియర్ లోనే హైయెస్ట్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2 సినిమాలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా అక్టోబర్ 10 వ తేదీ మొదటి భాగం విడుదల కానుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందు రాబోతున్న ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఈయన కే జి ఎఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కూడా మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుంది.

ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని ఈ సినిమా ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ఇటీవల మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా త్వరలోనే రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా రష్మిక నటించబోతున్నారని వార్తలు రాగా తాజాగా మరో వార్త వైరల్ అవుతుంది.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఎప్పుడు తీసుకొని రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2, దేవర సినిమాలకు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు కానీ ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఏకంగా 130 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అయితే ఈ రెమ్యూనరేషన్ ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ అని ఇప్పటివరకు ఈ స్థాయిలో ఏ సినిమాకి రెమ్యూనరేషన్ అందుకోలేదని చెప్పాలి.

Read More: పొట్టేలు తలకాయలతో బాలయ్యకు దండ.. హిందూపురంలో బాలయ్య మాస్ క్రేజ్!

ట్రెండింగ్ వార్తలు