అభిమాని గుండె పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన తారక్…ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

May 15, 2024

అభిమాని గుండె పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన తారక్…ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఆయనని చుట్టూ ముడుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఇటీవల జరిగిన ఎన్నికలలో భాగంగా ఒక సాధారణ వ్యక్తి లాగా క్యూ లైన్ లో నిలబడి మరి ఓటు వేసిన సంగతి మనకు తెలిసిందే. మే 13వ తేదీ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో సెలబ్రిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్టీఆర్ సైతం నీలిరంగు చొక్కాలో కనిపించి సందడి చేశారు.

ఈ విధంగా ఎన్టీఆర్ నీలిరంగు చొక్కా వేసుకోవడంతో ఈయన వైఎస్ఆర్సిపికి మద్దతుగానే ఈ షర్టు వేసుకొని వచ్చారు అంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. ఇకపోతే ఎన్టీఆర్ తన ఓటును వేసి తిరిగి వెళుతున్నటువంటి క్రమంలో అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకోవడం కోసం ఎగబడ్డారు.

ఈ క్రమంలోనే అభిమానులందరూ కూడా గుంపుగా వెళ్లి సెల్ఫీ కోసం ఎగబడగా ఓ అభిమాని మాత్రం అన్నా ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని అడగడంతో వెంటనే ఎన్టీఆర్ పెన్ను తీసుకుని అభిమాని గుండెపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇలా ఎన్టీఆర్ అభిమాని షర్ట్ మీద ఆటోగ్రాఫ్ ఇవ్వడం చూసి అక్కడున్న వారందరూ ఒక్కసారిగా కేకలు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసి నా అభిమానులు ఇందుకే కదా అన్న నీకు మేము అభిమానులుగా మారిపోయేది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ సినిమా వార్ 2 లో కూడా నటిస్తూ ఎన్టీఆర్ ఎంతో బిజీగా ఉన్నారు.

Read More: నెటిజన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మీ.. పిల్లల్ని కనగానే సరిపోదంటూ?

Related News

ట్రెండింగ్ వార్తలు