August 14, 2024
ఈ రోజు ఉదయం నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా చేతికి గాయమైందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు…తాజాగా ఈ విషయం మీద ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ ఆఫీసు నుండి వచ్చిన ప్రకటన ప్రకారం కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు ఎడమ మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా ఆయన చేతికి ఒక కట్టు కట్టారు. అంతే తప్ప ఆ గాయం ఈ రోజు అయింది కాదు.. అభిమానులు ఆందోళణ చెందాల్సిన అవసరంలేదని వివరణ ఇచ్చింది.
నిన్న అర్ధరాత్రి దేవర షూటింగ్‌ని పూర్తి చేశాడు తారక్…చేతికి బలమైన గాయం అయినప్పటికీ నటనమీద తనకున్న ప్యాషన్ తో షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది..చేతి కట్టును రెండు వారాల్లో తొలగించనున్నారు. ఈలోగా ఈ చిన్న గాయానికి సంబంధించి ఎక్కువ ఊహాగానాలు వైరల్ చేయవద్దని ఎన్టీఆర్ టీమ్ అభ్యర్ధించింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తారక్ దాదాపు రెండున్నరేళ్ల తర్వాత దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది.