February 20, 2024
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవర. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని ఇన్నాళ్లు అనుకున్నారు. అయితే ఇప్పుడు ఒక కొత్త రూమర్ వినిపిస్తోంది. దేవర సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే దీని గురించి టీం ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే ప్రూఫ్ ఇదిగోండి అంటూ కొన్ని కొత్త పాయింట్స్ చూపిస్తున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ప్రకారం దేవర టీం నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు సంబంధించిన మూడు లుక్స్ రిలీజ్ అయ్యాయి. ఇందులో మొదటిది బ్లాక్ కలర్ లుంగీ షర్ట్ వేసుకొని, చేతితో రక్తంతో తడిచిన ఒక ఆయుధాన్ని పట్టుకొని నిల్చున్న ఎన్టీఆర్ లుక్. మరొకటి ప్యాంట్ షర్ట్ వేసుకుని పడవలో కోపంగా చూస్తున్న ఎన్టీఆర్ లుక్.
ఇక రీసెంట్ గా సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ మరొక పోస్టర్ ని వదిలింది. ఇందులో ఎన్టీఆర్ లుక్ పూర్తి డిఫరెంట్ గా ఉంది. హెయిర్ స్టైల్ వేషధారణ అంతా ముందు రిలీజ్ చేసిన పోస్టర్లకి భిన్నంగా ఉంది. రుద్రాక్ష కాకుండా వేరే లాకెట్ ఉంది. ఈ మూడు లుక్స్ ని కంపేర్ చేస్తూ మొదటి లుక్ తండ్రి పాత్ర అయితే మిగిలిన రెండు క్యారెక్టర్లు ఇద్దరు కొడుకుల పాత్రలు అని నెటిజన్స్ ఒక అభిప్రాయానికి వచ్చేశారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వాదన కొట్టి పారేస్తున్నారు. మొదటి రెండు పోస్టర్లు తండ్రి పాత్రకి సంబంధించిన పోస్టర్లే.
మూడవది మాత్రమే కొడుకు పాత్రకి సంబంధించిన పోస్టర్ అంటూ మీడియాలో ఈ సినిమా గురించి తెగ చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికి ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ పోషిస్తున్నట్లయితే కనుక అది నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేటి రోజుల్లో చాలామంది డబ్బు డ్యూయల్ రోల్ కూడా పోషించడం లేదు. అలాంటిది ఎన్టీఆర్ ఎప్పుడో జై లవకుశ సినిమా లోనే ట్రిపుల్ రోల్ పోషించాడు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాతో రిపీట్ చేస్తున్నట్లయితే గనక ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గర్వించే విషయం.
Read M0re: తగ్గుతున్న సుమ క్రేజ్.. ఆ సర్వేలో నాలుగో స్థానానికి పరిమితమైన సుమ?