July Month OTT Releases: ఈ నెలలో ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే?

July 2, 2024

July Month OTT Releases: ఈ నెలలో ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే?

సాధారణంగా ఒక సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత మనం ఆ సినిమాలను టెలివిజన్ లో ప్రసారం చేసినప్పుడు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వచ్చిన తర్వాత థియేటర్లో విడుదలైన నెల రోజుల లోపే మనం ఆ సినిమాలను ఓటీటీలో చూసే వెసులుబాటు కలుగుతుంది. ఈ క్రమంలోనే ప్రతి వారం ఎన్నో కొత్త సినిమాలు ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. మరి జూలై నెలలో కూడా సరికొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. జులై నెలలో ఓటీటీలో విడుదల కాబోయే సినిమాలు ఏవి ఎక్కడ ప్రసారం కాబోతున్నాయి అనే విషయానికి వస్తే..

మహారాజా: విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం జూన్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇ్పటికే 100కోట్ల రూపాయల కలెక్షన్లన అధిగమించింది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను రాబట్టింది. మహారాజ చిత్రం జూలైలోనే నెట్‍ఫ్లిక్స్ లో రాబోతుంది. ఈ చిత్రాన్ని జూలై మూడో వారంలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం.

మనమే: శర్వానంద్ కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మనమే ఈ సినిమా జూన్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది థియేటర్లలో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటిటిలో ప్రసారం కాబోతోంది. అయితే ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాల గురించి మేకర్స్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు త్వరలోనే తెలియజేయబోతున్నారు అయితే ఈ సినిమా కూడా జూలైలోనే విడుదల కానుంది.

మీర్జాపూర్ సీజన్ 3: ఓటీటీ ఆడియెన్స్ ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న మీర్జాపూర్ మూడో సీజన్ జులై నెలలోనే స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 5 నుంచి స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు