January 4, 2022
Jr.NTR: 2018లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం తర్వాత వెండితెరపై ఎన్టీఆర్ కనిపించలేదు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ ఒక హీరోగా చేసిన ఈ చిత్రం విడుదల ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడింది. ఒక ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడన్నా విషయంపై కూడా ఓ స్పష్టత లేకుండా పోయింది. అయితే ఎన్టీఆర్ తర్వాతి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయాలి. కానీ కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తర్వాత ఎలాగు విడుదల తేధి దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌తోనే సరిపోతుంది.. పోనీ ఎన్టీఆర్ కమిటైన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయాలనుకున్న…ప్రశాంత్ నీల్‌కు ఇప్పుడు ఉన్న కమిట్‌మెంట్స్ వేరు. పైగా ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ ‘సలార్’ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏ సినిమాను స్టార్ట్ చేయాలో తెలియక ఎన్టీఆర్ అయోమయంలో పడ్డారు. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తన అభిమాన నటుడ్ని వెండితెరపై చూసుకుని 3సంవత్సరాలకు పైనే అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఒకవేళ ఇప్పటికిప్పుడు ఏదైనా కొత్త దర్శకుడితో సినిమా ప్రకటించినా మళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం మరో నెల రోజులు కేటాయించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ నుండి ఎలాంటి ప్రకటన వస్తుందో మరి చూద్దాం..