March 5, 2024
టాలీవుడ్ యంగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలతో పాటు ఈయన మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా బిజీ అవుతున్నారు. ఇప్పటికే యష్ రాజ్ ఫిలిం యూనివర్స్ లో రాబోతున్నటువంటి వార్ 2 సినిమాలోఈయన ఓ పాత్రలో నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ వార్ 2 సినిమా తర్వాత మరో బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా Spy యూనివర్సల్ భాగం కాబోతుందని తెలుస్తోంది. వార్ 2 తరువాత సేమ్ బ్యానర్లు సేమ్ క్యారెక్టర్స్ తో ఫుల్ లెన్త్ స్టోరీ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇలా బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా ఈయన టాలీవుడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర సినిమాలో నటిస్తున్నటువంటి ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
Read More: ఎన్టీఆర్ పేరును కొడుకుకు పెట్టిన గీతామాధురి.. తెగ వైరల్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్!