కేవలం కరోనా వల్లే పెళ్లి చేసుకున్నాము.. కాజల్ షాకింగ్ కామెంట్స్!

May 15, 2024

కేవలం కరోనా వల్లే పెళ్లి చేసుకున్నాము.. కాజల్ షాకింగ్ కామెంట్స్!

వెండితెర చందమామ నటి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె ప్రస్తుతం సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కాజల్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కాజల్ అగర్వాల్ తన పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీ పెళ్లి లవ్ మ్యారేజ్ లేక అరేంజ్డ్ మ్యారేజ్ అంటూ ఆలీ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కాజల్ సమాధానం చెబుతూ గౌతం తనకు పది సంవత్సరాల నుంచి బాగా పరిచయమని తెలిపారు. మాది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని ఈమె వెల్లడించారు.

10 సంవత్సరాల మా పరిచయం తర్వాత పెళ్లి చేసుకున్నామని అయితే కరోనా సమయంలో అందరూ కూడా పనులు మానుకొని ఇంట్లోనే లాక్ అయిపోయారు అయితే మేము కూడా ఎలాగో ఇంట్లోనే ఉన్నాము కదా పెళ్లి చేసుకొని లాక్ అవుదామని భావించి కరోనా సమయంలోనే పెళ్లి చేసుకున్నాము అంటూ ఈ సందర్భంగా కాజల్ తన పెళ్లి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

బహుశా కరోనా కనక లేకపోతే ఇప్పటికీ ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగి ఉండేదేమో అంటూ పలువురు ఈ వ్యాఖ్యలపై కామెంట్ లు చేస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ కొద్ది రోజులపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె కుమారుడు జన్మించిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

Read More: అభిమాని గుండె పై ఆటోగ్రాఫ్ ఇచ్చిన తారక్…ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

ట్రెండింగ్ వార్తలు