ఆ సినిమా చూసి బాగా ఏడ్చాను.. కాజల్ అగర్వాల్ కామెంట్స్ వైరల్!

May 27, 2024

ఆ సినిమా చూసి బాగా ఏడ్చాను.. కాజల్ అగర్వాల్ కామెంట్స్ వైరల్!

సినీ నటి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె పెళ్లి చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.

ఇలా విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జూన్ 7వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్ వైరల్ అవుతున్నాయి.

ఓసారి ఇంట్లో తాను ఒంటరిగా ఉన్నప్పుడు మేజర్ సినిమా చూశానని తెలిపారు. అయితే ఈ సినిమాలో లీనం అయిపోయిన నేను నాకు తెలియకుండానే బాగా ఏడ్చానని ఆ సినిమా నన్ను అంతగా కనెక్ట్ చేసిందని కాజల్ తెలిపారు. ఇక ఈ సినిమా చూసి ఏడుస్తూనే ఫారన్ లో ఉన్నటువంటి మా ఆయనకు ఫోన్ చేసి నేను శశికిరణ్ డైరెక్షన్లో సినిమా చేయాలనుకుంటున్నానని చెప్పానంటూ ఈ సందర్భంగా కాజల్ వెల్లడించారు.

ఇక తాను భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో ఉండగా శశికిరణ్ తన టీంతో కలిసే అక్కడికి వచ్చారు. ఆ రోజు నేను బాగా అలసిపోయి ఉన్నాను కేవలం ఒక గంట మాత్రమే కేటాయిస్తారని చెప్పాను కానీ ఆయన కథ మొదలు పెట్టగానే మాకు తెలియకుండా మూడు గంటలు పూర్తి అయ్యాయని ఈ సినిమా అంత అద్భుతంగా ఉండబోతుందని కాజల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: రామ్ డబుల్ ఇస్మార్ట్ బడ్జెట్ ఎంతో తెలుసా..సాహసం చేస్తున్న పూరీ?

ట్రెండింగ్ వార్తలు