ఆ విషయంలో టాలీవుడ్ మారాలి.. కాజల్ కామెంట్స్ వైరల్!

May 20, 2024

ఆ విషయంలో టాలీవుడ్ మారాలి.. కాజల్ కామెంట్స్ వైరల్!

సినీ నటి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె హీరోయిన్ గా వరుస సినిమాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన మంచి సక్సెస్ అందుకున్నారు. ఈమె కేవలం సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకున్న సంగతి తెలిసిందే.

ఇలా వరుస భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని ఒక బాబుకి జన్మనిచ్చారు. ఇక అమ్మగా మారిన తర్వాత కూడా ఈమె సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

కాజల్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా పెళ్లి అయితే హీరోయిన్లకు అవకాశాలు తక్కువగా వస్తాయనే విషయం గురించి మాట్లాడారు. పెళ్లి తర్వాత నా కెరీర్ లో ఎలాంటి మార్పు లేదు. బాలీవుడ్ లో పెళ్లి తర్వాత కూడా హీరోయిన్లు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు.

ఈ విషయంలో టాలీవుడ్ లో మాత్రం ఇంకా మార్పు రాలేదు. ఇక్కడ పెళ్ళైన హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడానికి మేకర్స్ ఆలోచిస్తున్నారని అయితే త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ విషయంలో మార్పు వస్తుందని అందుకు నేనే ఉదాహరణ అంటూ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: బెంగళూరు రేవ్ పార్టీకి నాకు సంబంధం లేదు.. నటి హేమ క్లారిటీ?

ట్రెండింగ్ వార్తలు