Satyabhama: ఓటీటీలోకి కాజల్ సత్యభామ..స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

June 28, 2024

Satyabhama: ఓటీటీలోకి కాజల్ సత్యభామ..స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Satyabhama Movie OTT Release Date: వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల నటించిన తాజా చిత్రం సత్యభామ లేడీ ఓరియంటెడ్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఈమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి సందడి చేశారు. ఇలా విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా జూన్ 7వ తేదీ విడుదల అయింది.

జూన్ 7వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఇలా జూన్ 7వ తేదీ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీపడ్డారు. అయితే ఈ సినిమా హక్కులను తెలుగు ఓటీటీ సమస్థ ఆహా భారీ ధరలకు కైవసం చేసుకున్నారు.

ఇక ఈ సినిమా జూన్ 7వ తేదీ విడుదల కాగా ఓటీటీలో జూన్ 28వ తేదీ నుంచి ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి మేకర్స్ ఎలాంటి అధికారక ప్రకటన తెలియజేయలేదు కానీ త్వరలోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆహా అధికారకంగా ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత కాజల్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈమె మంచి విష్ణు ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో భాగంగా కాజల్ కళ్ళను మాత్రమే చూపించారు. అయితే ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తున్నారు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.

READ MOREఏపీ రాజకీయాలలోకి హైపర్ ఆది.. ఏకంగా ఆ పదవిలో? 

ట్రెండింగ్ వార్తలు