పెళ్లయిన హీరోయిన్స్ అంటే వాళ్లకు నచ్చరు.. కాజల్ సంచలన వ్యాఖ్యలు!

June 5, 2024

పెళ్లయిన హీరోయిన్స్ అంటే వాళ్లకు నచ్చరు.. కాజల్ సంచలన వ్యాఖ్యలు!

సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కాజల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చలామణి అయినటువంటి ఈమె ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరి హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటించిన కాజల్ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక పెళ్లయిన వెంటనే కాజల్ ప్రెగ్నెంట్ కావడం ఒక బాబుకు జన్మనివ్వడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు అయితే ప్రస్తుతం తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు.

ఇక త్వరలోనే శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సత్యభామ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు లేడీ ఓరియంటెడ్ సినిమాగా రాబోతున్నటువంటి ఈ చిత్రం త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె సౌత్ ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా నటించిన వారు పెళ్లయిన తర్వాత ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే కష్టమని తెలిపారు. పెళ్లయిన వారు అంటే సౌత్ చిత్ర పరిశ్రమలో బాగా పక్కన పెట్టేస్తారు కానీ నార్త్ లో అలా కాదు ఇప్పటికీ అక్కడ పెళ్లయిన వారు పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తున్నారని తెలిపారు. ఇక సౌత్ లో నయనతార మాత్రమే మినహాయింపు. సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ మార్పు రావాలని కాజల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: ఇకపై జాతకాలు చెప్పను.. సంచలన నిర్ణయం తీసుకున్న వేణు స్వామి!

ట్రెండింగ్ వార్తలు