కన్నప్పలో స్టార్ హీరోయిన్ కాజల్.. ఇంకా ఎంతమందిని దించుతావు బాసు?

May 17, 2024

కన్నప్పలో స్టార్ హీరోయిన్ కాజల్.. ఇంకా ఎంతమందిని దించుతావు బాసు?

సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగినటువంటి వారిలో నటుడు మంచు విష్ణు ఒకరు. ఈయన ఇదివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను చేశారు. అయితే ఇటీవల కాలంలో మంచి విష్ణు చేస్తున్న సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయితే మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు బాగమయ్యారు. ఈ సినిమాలో మోహన్ లాల్, శివకుమార్, మోహన్ బాబు, ప్రభాస్,నయనతార వంటి స్టార్ సెలబ్రిటీలందరూ కూడా భాగం కాబోతున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ సినిమాలో మరొక స్టార్ హీరోయిన్ కూడా నటించబోతున్నారని తెలుస్తోంది.

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇకపోతే కాజల్ అగర్వాల్ త్వరలోనే సత్యభామ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాజల్ అగర్వాల్ కన్నప్ప సినిమాలో కూడా కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది.

ఇక ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేస్తూ ఆమెను సినిమా షూటింగ్లోకి స్వాగతిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఇప్పటికే విష్ణు మంచు, కాజల్ కలిసి ఇది వరకు మోసగాళ్లు మూవీని చేసిన సంగతి తెలిసిందే. ఇక మంచు విష్ణు కీలకపాత్రలో నటిస్తున్నటువంటి కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నారు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Read More: ఆ పార్టీ గెలిస్తే పవన్ కు ఆ పదవి ఇస్తారా.. ఆ ఎనర్జీ లెవల్ కు అదే కరెక్ట్ అంటున్న ఫ్యాన్స్?

ట్రెండింగ్ వార్తలు