ఆచార్య సినిమాలో తన పాత్ర తొలగింపు పై కాజల్ షాకింగ్ కామెంట్స్!

June 6, 2024

ఆచార్య సినిమాలో తన పాత్ర తొలగింపు పై కాజల్ షాకింగ్ కామెంట్స్!

సినీ నటి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోయిన్ గా ఒకానొక సమయంలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన కాజల్ చేసుకొని కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అయితే ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె వరస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇటీవల భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాజల్ త్వరలోనే సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 7 న విడుదల కానుంది.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాజల్ అగర్వాల్ కు ఆచార్య సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ చిరంజీవి నటించినటువంటి ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ భారీ డిజాస్టర్ అయింది అయితే ఇందులో కాజల్ అగర్వాల్ చిరంజీవికి జోడిగా నటించారు. అయితే చివరి నిమిషంలో ఈమె పాత్రకు సంబంధించిన సీన్లు అన్నీ కూడా తీసేసి సినిమాని విడుదల చేశారు.

ఇలా కాజల్ అగర్వాల్ తన పాత్ర తొలగింపు పై ఎప్పుడు కూడా స్పందించలేదు ఈ సినిమా డిజాస్టర్ అయిన కొరటాల చిరంజీవి పై ఎన్నో విమర్శలు వచ్చినా కూడా రియాక్ట్ అవ్వని కాజల్ తాజాగా రియాక్ట్ అయ్యారు. సత్యభామ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆచార్య సినిమా నుంచి మీ పాత్రను తొలగించిన తర్వాత మీరు ఎలా ఫీలయ్యారు అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు కాజల్ సమాధానం చెబుతూ.. ఇట్స్ ఓకే.. జరిగిందేదో జరిగిపోయింది. దానికి నేనేం చేయలేను మీలాగే నేను కూడా ఫీలయ్యాను. అయితే నా పాత్ర ఎందుకు తొలగించారని నేను ఎవరిని అడగలేదు అడగాల్సిన అవసరం కూడా నాకు లేదు ఆ విషయాన్ని నేను ఎప్పుడో నా మైండ్ నుంచి డిలీట్ చేశానని. వాటి గురించి ఆలోచిస్తుంటే ముందుకు వెళ్లలేమని ఈ సందర్భంగా కాజల్ ఆచార్య సినిమా గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: నటి పూర్ణతో రవిబాబు ఎఫైర్.. అసలు విషయం బయటపెట్టిన నటుడు?

ట్రెండింగ్ వార్తలు