అల్లు అర్జున్‌పై కరణ్‌ జోహర్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నాడంటే?

December 28, 2021

అల్లు అర్జున్‌పై కరణ్‌ జోహర్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నాడంటే?
Pushpa Movie: అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషనల్‌లో వచ్చిన క్రేజీ చిత్రం ‘పుష్ప: ది రైజ్స బాక్సఫీస్ వ‌ద్ద త‌గ్గేదే..లే అంటూ వసూళ్లను కొల్లగొడుతుంది. పుష్ప రాజ్‌ పాత్రలో బన్నీ ఊర మాస్‌ యాక్టింగ్‌కు అభిమానుల‌తో పాటు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పాన్‌ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాపై బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కరణ్‌ జోహార్‌ పుష్ప సినిమా కలెక్షన్లు ఉదహరిస్తూ తెలుగు సినిమాల ప్రారంభ వసూళ్లను హిందీ చిత్రాలు కూడా అందుకోలేకపోతున్నాయని తెలిపాడు. ‘ఓటీటీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు చిత్రాలు హిందీలో అనువాదమవుతున్నాయి. దీంతో అందులో నటించిన నటులకు కూడా హిందీలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కు బాలీవుడ్‌లో క్రేజ్‌ పెరిగింది. దీన్ని ఎవరూ ఆపలేరు. అందుకే హిందీలో రిలీజైన పుష్ప సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. హిందీ సినిమాలు సైతం అతంగా వసూళ్లు సాధించలేకపోయాయి.’ అని పేర్కొన్నాడు కరణ్‌ జోహార్‌. అంతేకాకుండా అల్లు అర్జున్‌కు పుష్ప సినిమాతో బాలీవుడ్‌లో మరింత క్రేజ్‌ పెరిగింది. ఇప్పటికే పలువురు బీటౌన్‌ సెలబ్రిటీలు సినిమాపై, బన్నీ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే కరణ్‌ జోహార్‌ కూడా అల్లు అర్జున్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ పుష్పకు అత్యధిక వసూళ్లు వచ్చాయని పేర్కొన్నాడు. త్వ‌ర‌లో బ‌న్నీతో హిందీ సినిమా కూడా చేసే అవ‌కాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు