కల్కి ప్రీ రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడు ఎక్కడంటే?

May 15, 2024

కల్కి ప్రీ రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడు ఎక్కడంటే?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమాలలో కల్కి సినిమా ఒకటి. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా వివిధ భాషలలో మే 27తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా మే తొమ్మిదవ తేదీ విడుదల కావాల్సి ఉండగా పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు.

ఇలా మే 9వ తేదీ విడుదల కావలసిన ఈ సినిమా కాస్త మే 27వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ పెద్ద ఎత్తున ఈ సినిమా పనులను పూర్తి చేస్తున్నారు. ఒకవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తూనే మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెడుతూ వచ్చారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

ఈ సినిమా మే 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో మే 22వ తేదీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా వేడుకలను చాలా ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఈ విషయాన్ని అధికారకంగా తెలియచేయునున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తున్నారు అలాగే కమల్ హాసన్ అమితాబ్ వంటి వారందరూ కూడా కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా వైజయంతి మూవీ మేకర్స్ నిర్మాణంలో అశ్వినీ దత్ నిర్మిస్తూ ఉండగా నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేస్తున్నారు.

Read More: హైదరాబాదులో గేమ్ చేంజర్ క్లైమాక్స్ షూటింగ్.. నెక్స్ట్ మంత్ నుంచి వేరే షూటింగ్ లో చరణ్!

ట్రెండింగ్ వార్తలు