ఓయమ్మో దీపిక ధరించిన ఈ బ్రేస్ లేట్ ఖరీదు అన్ని కోట్లా… అమ్మితే లైఫ్ సెటిల్?

June 20, 2024

ఓయమ్మో దీపిక ధరించిన ఈ బ్రేస్ లేట్ ఖరీదు అన్ని కోట్లా… అమ్మితే లైఫ్ సెటిల్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి దీపిక పదుకొనే త్వరలోనే కలికి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ముంబైలోని నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈమె పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో దీపిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఇటీవల ప్రెగ్నెంట్ అంటూ శుభవార్తను అభిమానులతో పంచుకున్న ఈమె చాలా రోజుల తర్వాత ఈ కార్యక్రమంలో కనిపించారు. అయితే బేబీ బంప్ తో దీపిక కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపించి సందడి చేశారు.

టైట్ బ్లాక్ డ్రెస్ వేసుకోవడమే కాకుండా ఈ డ్రెస్ లో తన బేబీ బంప్ క్లియర్ గా కనిపించింది. ఇక ఈ కార్యక్రమంలో ఈమె చాలా సింపుల్ గా కనిపించారు. అయితే తన ఎడమ చేతికి బ్రేస్ ధరించి చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. అయితే ఈమె తన చేతికి వేసుకున్న ఈ డైమండ్ బ్రేస్ లేట్ ఖరీదు ఎంత ఉంటుంది అనే విషయం గురించి నేటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఇక చూడటానికి సింపుల్ గా అనిపించిన ఈమె ధరించిన ఈ డైమండ్ బ్రేస్ లేట్ ధర ఏకంగా ఒక కోటి 16 లక్షల రూపాయల విలువ చేస్తుందనే విషయం తెలిసే ఒక్కసారిగా నేటిజన్స్ షాక్ అవుతున్నారు. ఈ ఒక్క బ్రేస్ లేట్ అమ్మితే చాలు మనలాంటి సాధారణ వారి జీవితాలు సెటిల్ అవుతాయి అంటూ పలువురు దీని ఖరీదు పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మనకి ఇలాంటివి ఖరీదు అనిపించినా సెలబ్రిటీలకు మాత్రం ఇలాంటివన్నీ సర్వసాధారణమే అని చెప్పాలి.

Read More: ట్రోల్స్ వల్ల నాకు పని బాగా పెరిగింది.. ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన వేణు స్వామి!

ట్రెండింగ్ వార్తలు