కల్కి సీజీ వర్క్‌పై అలాంటి పోస్ట్ చేసిన నిర్మాత.. నాగ్ అశ్విన్ రియాక్షన్ ఇదే?

May 11, 2024

కల్కి సీజీ వర్క్‌పై అలాంటి పోస్ట్ చేసిన నిర్మాత.. నాగ్ అశ్విన్ రియాక్షన్ ఇదే?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు ప్రభాస్. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ వరుసగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే కల్కి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా నిర్మాత స్వప్న దత్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సరదాగా పోస్ట్‌లు పెడుతూ ఉంటారు. తాజాగా కరెంట్‌ ఎఫైర్స్‌ ఆఫ్‌ వైజయంతి అంటూ నాగ్‌ అశ్విన్‌కు తనకు మధ్య జరిగిన సరదా సంభాషణను ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కల్కి సీజీ వర్క్‌ చేస్తున్న వారంతా ఓటువేయడానికి హైదరాబాద్‌ నుంచి వాళ్ల ఊర్లకు వెళ్లారు ఇప్పుడెలా అని నాగ్‌ అశ్విన్‌ అనగా.. ఎవరు గెలుస్తారేంటి అని స్వప్న అడిగారు.

దానికి ఆయన సరదాగా బదులిస్తూ..ఎవరు గెలిస్తే నాకెందుకండీ.. నా సీజీ షాట్స్‌ ఎప్పుడు వస్తాయో అని నేను ఎదురుచూస్తున్నా అని అన్నారు. దీంతో కల్కి గ్రాఫిక్స్‌ వర్క్‌ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు అర్థమవుతోంది. మరోవైపు ఈ చిత్రాన్ని జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈలోగా వర్క్‌ అంతా పూర్తి చేయాలని మూవీ యూనిట్‌ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఒకరు వైసీపీ, ఒకరు జనసేన?

Related News

ట్రెండింగ్ వార్తలు