కల్కి నుంచి బిగ్ అప్డేట్.. 10 న రాబోతున్న ట్రైలర్?

June 5, 2024

కల్కి నుంచి బిగ్ అప్డేట్.. 10 న రాబోతున్న ట్రైలర్?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే త్వరలోనే ఈయన కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మే తొమ్మిదవ తేదీనే విడుదల కావాల్సి ఉండగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడింది. ఈ క్రమంలోనే జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భాషలలో విడుదల కాబోతుంది.

ఇక ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడిగా వ్యవహరించగా అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరించారు. సుమారు 600 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి ప్రభాస్ బుజ్జి అంటూ బుజ్జిని పరిచయం చేస్తూ ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బుజ్జి బొమ్మలను పలువురు సెలబ్రిటీ పిల్లలకు కానుకలుగా అందజేస్తూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

ఇలా ప్రభాస్ కల్కి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి త్వరలోనే ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ ఈ సినిమా నుంచి ట్రైలర్ రాబోతుంది అంటూ మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక ఇప్పటికే విడుదలైనటువంటి టీజర్, బుజ్జి గ్లిప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేసాయి. మరి కల్కి సినిమా ప్రభాస్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది ఈయన చివరిగా సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Read More: మొదటిసారి పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. ట్వీట్ వైరల్?

ట్రెండింగ్ వార్తలు