ప్రభాస్ కల్కి ట్రైలర్ అప్పుడు విడుదల కానుందా.. ఇందులో నిజమెంత?

May 31, 2024

ప్రభాస్ కల్కి ట్రైలర్ అప్పుడు విడుదల కానుందా.. ఇందులో నిజమెంత?

టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం క‌ల్కి 2898AD. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమలహాసన్ లాంటి సెలబ్రెటీలు కూడా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై నిర్మించిన ఈ సినిమా జూన్ 27 ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

దాంతో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, అప్డేట్లు ఫొటోస్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, బుజ్జి ఇవ‌న్నీ ఆక‌ట్టుకున్నాయి. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం క‌స‌ర‌త్తు చేస్తోంది. ట్రైల‌ర్ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ట్రైల‌ర్‌ను జూన్ 7 విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వార్త పై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ ఒక్కొక్కటిగా అప్డేట్ ను విడుదల చేస్తుండడంతో అవి సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Read More: Gangs Of Godavari Twitter Review: విశ్వ‌క్ సేన్ న‌టించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఎలా ఉందంటే?

ట్రెండింగ్ వార్తలు