కల్కి మూవీ నిర్మాతకు టీటీడీ చైర్మన్ పదవిని అప్పగించారా.. ఇందులో నిజమెంత?

June 6, 2024

కల్కి మూవీ నిర్మాతకు టీటీడీ చైర్మన్ పదవిని అప్పగించారా.. ఇందులో నిజమెంత?

ఇటీవల ఏపీలో కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంతో గత ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, పలు పదవుల్లో ఉన్న వాళ్ళు రిజైన్ చేస్తున్నారు. అయితే త్వరలోనే కూటమి ప్రభుత్వం తరపున కొత్త వాళ్ళని నియమించనున్నారు. అయితే ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ పదవి సినీ పరిశ్రమలో స్టార్ నిర్మాతకు రాబోతుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఆ నిర్మాత మారెవరో కాదు వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్. ఈయన మొదటి నుంచి టీడీపీ పార్టీ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ఉన్నప్పటీ నుంచే ఆ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తూనే వచ్చారు అశ్వనిదత్. అంతే కాకుండా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ ని ఖండించి, కూటమి భారీగా గెలుస్తుందని తెలిపారు. అశ్వినీదత్ టీడీపీ సపోర్ట్ అని పరిశ్రమలో కూడా అందరికి తెలిసిందే. అలాగే అశ్వినీదత్ కు ఎన్టీఆర్ కుటుంబంతో, చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఖాళీ అయిన టీటీడీ చైర్మన్ పదవి నిర్మాత అశ్వినీదత్ కు దక్కుతుందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇవి ఎంతవరకు నిజం అనేది చూడాలి మరి. ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటించేదాకా అసలు నిజం ఏంటి అనేది తెలియదు. అయితే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమ నుంచి దర్శకుడు రాఘవేంద్ర రావు టీటీడీ మెంబర్ గా, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే SVBC ఛానల్ కు చైర్మన్ గా కూడా ఉన్నారు. దీంతో అశ్వినీదత్ కు కూడా టీటీడీ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇకపోతే నిర్మాత అశ్వనీ దత్ నిర్మించిన కల్కి మూవీ ఈనెల 27న విడుదల కానుంది.

Read More: రామ్ చరణ్ నో.. ఎన్టీఆర్ అయితే ఓకే అంటున్న అనుష్క?

ట్రెండింగ్ వార్తలు